NBK 107 Movie Shooting Update | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. కాగా నిర్మాతలకు డబ్బు, సమయం వృధా అవుతుంది అనే నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు షూటింగ్‌లను పున:ప్రారంభించే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇటీవలే నాని ‘దసరా’ సినిమాను సోమవారం నుండి స్టార్ట్ చేయనున్నట్లు అధికారకంగా ప్రకటించగా.. తాజాగా బాలయ్య కూడ ఎట్టి పరిస్థితుల్లోనూ వీలయినంత త్వరగా సినిమాను స్టార్ చేసి షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నాడట. టర్కీ షెడ్యూల్, బ్యాలన్స్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నాడట. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది.