Vijay Devarakonda | అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ‘ఇంత బీభత్సం ఎవరి కోసం..రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం..’ అనే సంభాషణలతో టీజర్ గూజ్బంప్స్ తెప్పించింది. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
తుది షెడ్యూల్ వైజాగ్లో మొదలైంది. మార్చి మొదటివారం వరకు జరిగే షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్, ఆర్ట్: అవినాష్ కొల్లా, సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.