నిరంతరం వార్తల్లో నిలిచే జంట అంటే.. టక్కున గుర్తొచ్చే పేర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంటుంది. దానికి తగ్గట్టే వీరిద్దరి ప్రవర్తన కూడా ఉంటుంది. శుక్రవారం రష్మిక తాజా సినిమా ‘మైసా’కు చెందిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న నేపథ్యంలో.. రష్మికకు ఆల్ ది బెస్ట్ చెబుతూ అభిమానులనుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టా ద్వారా రష్మికను అభినందించారు. ‘మైసా’ పోస్టర్‌కి ‘ఇది అద్భుతంగా ఉండనుంది’ అనే కామెంట్‌ని జత చేసి షేర్ చేశారు విజయ్ దేవరకొండ. దీనికి రష్మిక ఇచ్చిన రిైప్లె ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తుండటంతోపాటు చర్చనీయాంశంగా మారింది.
‘విజ్జూ.. ఈ సినిమాతో నేను.. నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా..’ అని క్యాప్షన్ పెడుతూ ఒక హార్ట్ ఎమోజీని కూడా జోడించింది రష్మిక. ఈ కామెంట్లో విజయ్‌ని ‘విజ్జూ..’ అని పిలవడంతో ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ‘ముద్దుపేర్లతో పిలుచుకునేంతవరకూ వచ్చిందనమాట వ్యవహారం..’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.