Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్‌గా మారాయి. ‘రణబాలి’ చిత్రీకరణ సమయంలో విజయ్ దేవరకొండ ఐదు కారవాన్లు ఏర్పాటు చేయాలని కోరారని, తన వెంట పెద్ద సంఖ్యలో అసిస్టెంట్లు ఉండాలని డిమాండ్ చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ఈ ప్రచారంపై ఇప్పటికే విజయ్ దేవరకొండ బృందం స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. హీరోపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. అసత్య కథనాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని విజయ్ టీమ్ హెచ్చరించింది. తాజాగా ఈ వివాదంపై చిత్ర నిర్మాత రవి కూడా స్పందించారు. షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, విజయ్ దేవరకొండ నుంచి అసాధారణమైన డిమాండ్లు ఏవీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఎప్పుడూ పనిపట్ల నిబద్ధతతో వ్యవహరిస్తారని, సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తారని నిర్మాత తెలిపారు. ఆయనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
ఇక ‘రణబాలి’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘రణబాలి’ చిత్రీకరణ దాదాపు 90 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా ‘రణబాలి’ రూపొందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.