Vijay Devarakonda | హిట్స్ వచ్చినా రాకపోయినా కెరీర్ మాత్రం పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్స్ కూడా క్యూ కడుతున్నారు. మరోవైపు కుర్ర దర్శకులను కూడా కలుపుకుంటూపోతున్నాడు విజయ్. అందుకే వరుస ఫ్లాపులు వచ్చినా కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ సెన్సేషనల్ హీరో. మొన్నటి వరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు శివ నిర్వాణ సినిమాకు కమిట్ అయ్యాడు. దీనికి ముందే పూరీతో జనగణమన సినిమా కూడా ఒప్పుకున్నాడు విజయ్. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తాడా లేదంటే శివ నిర్వాణ తర్వాత పూరి సినిమా పై ఫోకస్ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
లైగర్ సినిమా కోసం రా అండ్ రస్టిక్ లుక్ మెయిన్ టైన్ చేసిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు శివ కోసం పూర్తిగా మారిపోయాడు రాముడు మంచి బాలుడిలా కనిపిస్తున్నాడు. అప్పుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమా తర్వాత గీత గోవిందంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్.. ఇప్పుడు కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. లైగర్ లాంటి సెన్సేషనల్ మాస్ సినిమా తర్వాత శివ నిర్వాణతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. నిన్ను కోరి, మజిలీ లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న శివ నిర్వాణ.. గతేడాది నాని టక్ జగదీష్ సినిమాతో అంచనాలను అందుకోలేకపోయాడు. అయినా కూడా ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తొలిసారి తన ఫార్ములా మార్చుకొని మాస్ సినిమా చేసి చేతులు కాల్చుకున్న శివ నిర్వాణ.. విజయ్ దేవరకొండతో మళ్లీ తన స్కూల్ కి వెళ్ళిపోయాడు.
ఎమోషనల్ ఫ్యామిలీ కథతో మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు శివ. పైగా సమంత హీరోయిన్ కావడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. డియర్ కామ్రేడ్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఏదేమైనా వరుసగా మాస్ సినిమాలు చేస్తూనే మధ్యలో ఫ్యామిలీ సబ్జెక్టులు కూడా ఒప్పుకుంటూ తాను అందరివాడిని అని చెప్పకనే చెప్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి వీటితో విజయ్ మళ్లీ ఫాంలోకి వస్తాడా లేదా చూడాలి.
Samantha | లాంఛింగ్ ఈవెంట్లో కనిపించని సామ్..ఎక్కడికెళ్లిందో తెలుసా..?”
పూరీ జనగణమన లో విజయ్ దేవరకొండ సరసన నటించేది ఎవరంటే..?”
Jahnvi Kapoor | విజయ్ దేవరకొండ పార్టీ మూడ్.. జాన్వీకపూర్‌తో సెల్ఫీ కేక”
Vijay Devarakonda | విజయ్ దేవర కొండ న్యూ లుక్..ఈ స్టిల్ ఎక్కడిదంటే..?”