Janhvi kapoor in Vijay Devarakonda Movie | ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పూరీ జగన్నాథ్ ( Puri Jagannadh ) డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ( Janaganamana ) సినిమా ఎట్టకేలకు మొదలైంది. చాలా మంది హీరోల పేర్లు అనుకున్న తర్వాత విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్టు చేయడానికి రెడీ అయిపోయాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయనతోనే లైగర్ సినిమా తెరకెక్కిస్తున్న పూరీ జగన్నాథ్.. త్వరలోనే జనగణమన రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
ముందుగా మహేశ్ బాబుతో జనగణమన సినిమా చేయాలనుకున్నాడు పూరీ జగన్నాథ్. రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినా అది కుదరలేదు. పూరీ వరస ఫ్లాపుల్లో ఉండటంతో ఆయన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి ధైర్యం చేయలేదు మహేశ్ బాబు. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. వెంటనే జనగణమన మొదలు పెట్టనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం కూడా దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నాడు. కథ నచ్చడంతో తాను కూడా నిర్మాతగా మారాడు వంశీ పైడిపల్లి. తన కూతురు శిఖర పేరుతో శిఖర ప్రొడక్షన్స్ మొదలుపెట్టాడు. మొన్న విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. 2023 ఆగస్టు 3న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ జాన్వీ కి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పింది. పైగా సరైన కథ దొరికితే తన కూతురు తెలుగు సినిమాల్లో నటిస్తోంది అంటూ ఇదివరకే స్టేట్ మెంట్ ఇచ్చాడు జాన్వీ తండ్రి బోనీ కపూర్. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూడాలి మరి.. విజయ్ దేవరకొండ సినిమాతో శ్రీదేవి ముద్దుల కూతురు తెలుగు ఇండస్ట్రీకి వస్తుందో లేదో..!
“Janhvi Kapoor | మత్తెక్కించే పోజులతో మైండ్‌బ్లాక్ చేస్తున్న జాన్వీ కపూర్..”
Vijay Devarakonda | విజయ్-సామ్ సినిమాపై క్రేజీ అప్ డేట్..ఒకే అయినట్టేనా..?”
Janhvi Kapoor | జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందా..?”
Janhvi Kapoor | చీరకట్టులో తళుక్కుమన్న అందాల జాన్వీ..”
“Janhvi Kapoor | పసుపు రంగు డ్రెస్‌లో జాన్వీ కపూర్ హోయలు అదరహో..”