నిన్ను కోరి, మజిలీ సినిమాలతో డైరెక్టర్ గా మంచి బ్రేక్ అందుకున్నాడు శివ నిర్వాణ (Siva Nirvana). నానితో తెరకెక్కించిన టక్ జగదీష్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ డైరెక్టర్ ప్రస్తుతం విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda)తో చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఈ ప్రాజెక్టులో ఫీ మేల్ లీడ్ రోల్ లో కనిపించనుందని సమాచారం. శివ నిర్వాణతో మరోసారి స్ట్రాంగ్ లవ్‌స్టోరీతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని టాక్.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh ravichander) ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నాడట. ప్రస్తుతం ఇదే విషయంపై మేకర్స్ అనిరుధ్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోండగా..దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఒకవేళ అనిరుధ్ కన్ఫామ్ అయితే సినిమా క్రేజ్ మరింత పెరుగడం పక్కా అని అంటున్నారు మూవీ లవర్స్.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు పూరీ జగన్నాథ్‌తో జనగణమన సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు విజయ్. మొత్తానికి మహానటి సినిమాలో మెరిసిన సామ్, విజయ్..ఈ సారి రాబోయే ప్రేమకథలో ఎలా కనిపిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు.