టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) అప్ కమింగ్ ప్రాజెక్టు లైగర్ షూటింగ్ పూర్తి చేశాడు. నిత్యం ఏదో ఒక షెడ్యూల్‌తో బిజీగా ఉండే విజయ్ ఈ సారి కాస్త చిల్ అవుట్ అయ్యాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సీఈవో అపూర్వమెహతా బర్త్ డే పార్టీ (Apoorva Mehta birthday) తో ఫన్ టైం మూడ్‌లోకి వచ్చేశాడు లైగర్ హీరో.
ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అండ్ ఛార్మీ, అనన్య టీంతో కలిసి బ్లాక్ అవుట్ ఫిట్‌లో సందడి చేసిన విజయ్ దేవరకొండ పార్టీలో అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Jahnvi Kapoor)తో కలిసి సందడి చేశాడు.గోల్డెన్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌లో ఉన్న జాన్వీకపూర్‌తో బ్లాక్ షూట్లో ఉన్న విజయ్ స్మైల్ ఇస్తూ దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరోవైపు డిజైనర్ మనీష్ మల్హోత్రా, ఛార్మీ కౌర్ కూడా ఈ స్టిల్‌లో కనిపిస్తుండటం చూడొచ్చు. విజయ్ దేవరకొండ తన కోస్టార్ అనన్యపాండేతోపాటు అలియాభట్, ఇతర సెలబ్రిటీలతో కలిసి పార్టీ ఫన్ టైంను సరదాగా ఎంజాయ్ చేశాడు.