Vijay Devarakonda Liger Trailer | జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. మరీ ముఖ్యంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునే విధానంలో మిగిలిన వాళ్లందరికంటే చాలా ముందున్నాడు రౌడీ బాయ్. తాజాగా ఈయన లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు జరుగుతున్న ప్రమోషన్ చూసి బాలీవుడ్ కూడా నివ్వెరపోతుంది. తన ప్రమోషన్‌తో అక్కడ చాలామంది హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ సినిమాలకు కనీసం 40 కోట్ల మార్కెట్ కూడా లేదు. ఈయన కెరీర్లో కేవలం గీతగోవిందం సినిమా మాత్రమే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. మిగిలిన ఏ సినిమా 30 కోట్లు కూడా తీసుకురాలేదు. అయినా కూడా లైగర్ సినిమాకు దాదాపు 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా. దీనికి కేవలం ఆయన చేసుకుంటున్న ప్రమోషనే కారణం. ఓవైపు పూరీ జగన్నాథ్.. మరోవైపు కరణ్ జోహార్ లైగర్ సినిమాను కావలసినంత ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కంటెంట్ తెలిసిన విజయ్ దేవరకొండ ఒకే ఒక్క న్యూడ్ పోస్టర్‌తో నేషనల్ వైట్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇప్పుడు జూలై 21 ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 థియేటర్ దగ్గర 75 అడుగుల కటౌట్ పెట్టారు. ఇలా కేవలం ట్రైలర్ రిలీజ్‌కే కటౌట్ పెట్టడం అనేది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో జరుగుతుంది. అన్నీ కలిసి వచ్చి లైగర్ సినిమా కానీ హిట్ అయింది అంటే విజయ్ దేవరకొండ రేంజ్ అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఇందులో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తుంది. రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది.
“Liger Movie | ఆసక్తి రేపుతున్న ‘లైగర్’ లేటెస్ట్ పోస్టర్”