Liger Latest Poster | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగర్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కాబోతుంది. ఈక్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పోస్టర్లను విడుదల చేస్తూ ట్రైలర్‌పై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం మరో పోస్టర్‌ను విడుదల చేసింది.
రెండు రోజుల్లో ట్రైలర్ విడుదల కాబోతుందంటూ మేకర్స్ లైగర్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈపోస్టర్లో విజయ్ చూట్టూ మంటలు.. ఆ మంటల మధ్యలో చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. ముంభైలోని ఓ ఛాయ్ వాలా ప్రపంచం గుర్తించే బాక్సార్‌గా ఎలా ఎదిగాడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటించింది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
రెండు రోజులు | दो दिन | இரண்டு நாட்கள் | ಎರಡು ದಿನಗಳು | രണ്ടു ദിവസം
2 More Days To Go! #LigerTrailer#LigerTrailerOnJuly21 #Liger @TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @PuriConnects @DharmaMovies @sonymusicindia pic.twitter.com/ng9YrA7eiQ
— Puri Connects (@PuriConnects) July 19, 2022