విజయ్ ఆంటోని, స్వాసిక జంటగా నటిస్తున్న ‘వంద దేవుళ్లు’ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజయనేయులు జవ్వాజి నిర్మించారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ను నిహారిక కొణిదెల విడుదల చేశారు. ‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికి కనీస అవసరాలుంటాయి. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం’ అనే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
భార్యాభర్తల, తల్లీకొడుకుల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తూ ఈ ట్రైలర్ సాగింది. గ్రామీణ నేపథ్యంలో రైతు కథ ఇదని మేకర్స్ తెలిపారు. అజయ్, కావ్య, శక్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాలాజీ శ్రీరామ్, నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి, దర్శకత్వం: శశి.