Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) బుధవారం 41వ పుట్టిన రోజు (Birthday)ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నయన్‌కు తోటి తారలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నయన్ భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) కూడా లేడీ సూపర్ స్టార్‌కి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. తనపై ఉన్న ప్రేమను ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అంతేకాదు అదిరిపోయే గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు.
లగ్జరీ రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ (Rolls-Royce Black Badge Spectre)ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ఖరీదు రూ.10 కోట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విక్కీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. అందులో నయన్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Bigg Boss 9 | బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషన్స్, ట్విస్ట్‌లు.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫ్యామిలీస్
Puttaparthi | పుట్టపర్తి శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. హాజరైన సచిన్, ఐశ్వర్యరాయ్