దాదాపు రెండుమూడేళ్లుగా ‘కాంతార: చాప్టర్ 1’ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు దర్శక, నటుడు రిషబ్శెట్టి. ఎట్టకేలకు గత నెలలో ‘కాంతార: చాప్టర్ 1’ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అతిపెద్ద విజయం ‘కాంతార: చాప్టర్ 1’దే కావడం విశేషం. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నారు రిషబ్శెట్టి.
మరోవైపు తన తదుపరి సినిమా ‘జై హనుమాన్’ను ఆయన ఎప్పుడు మొదలుపెడతారు? అనే చర్చ సినీవర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో జనవరి తొలివారం నుంచే రిషబ్శెట్టి ‘జై హనుమాన్’ సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. దర్శకుడు ప్రశాంత్వర్మకు జనవరి నుంచి మే వరకూ మొత్తం అయిదు నెలలు డేట్స్ రిషబ్ కేటాయించినట్టు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఇక తెరకెక్కించడమే తరువాయి. ఇందులో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామిగా నటించనున్న విషయం తెలిసిందే. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.