Bigg Boss 9 | బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వారం కొనసాగుతుండటంతో ఇంట్లో భావోద్వేగాలు, హ్యాపీ మూమెంట్స్, అలాగే కొంత టెన్షన్ కూడా నెలకొంటున్నాయి. మంగళవారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఆయన భార్య హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సుమన్ శెట్టి భార్య లాస్య ప్రత్యేక ఎంట్రీతో హౌస్ మొత్తం ఉత్సాహంగా మారింది. వారి మ్యారేజ్ యానివర్సరీ కావడంతో బిగ్ బాస్ ప్రత్యేక అవకాశం ఇచ్చాడు. భార్యని చూసిన క్షణం సుమన్ సంభ్రమాశ్చర్యాలతో ఉప్పొంగిపోయాడు. ఇద్దరూ హగ్ చేసుకుని, క్యూట్ మూమెంట్స్ పంచుకున్న విధానం హౌస్‌మేట్స్‌ను కూడా ఎమోషనల్ చేసింది. కొడుకు గౌతమ్, ఇంట్లో వాళ్ల గురించి అడిగిన సుమన్, భార్య వచ్చిందనే ఆనందంతో పూర్తిగా ఫుల్ ఎనర్జీగా కనిపించాడు. అలాగే లాస్య ఆయనను నిజాయితీగా ఆడుతున్నావంటూ ప్రశంసించింది. కానీ ఒక ముఖ్యమైన సలహా కూడా ఇచ్చింది . తనూజకి కొంచెం దూరంగా ఉండాలి, ఆమెతో ఉంటే హైప్ ఆమెకే వెళుతుందని, గేమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించిన విషయం చర్చనీయాంశమైంది.
తర్వాత తనూజ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. అక్క కూతురు శ్రేష్ట, చెల్లి పూజా రావడంతో తనూజ ఆనందానికి అవధుల్లేవు. త్వరలో పెళ్లి కానుండడంతో పూజాని హౌస్‌లోకి పంపించారు. తనూజ బాగా ఆడుతున్నావని పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన పూజా, “ప్రతి విషయం మీద ఏడవద్దు, అమ్మ కూడా బాధపడుతోంది” అని చెప్పడం ఆమెని భావోద్వేగానికి గురి చేసింది. అనంతరం చెల్లిని పెళ్లికూతురిలా రెడీ చేసి బొట్టుపెట్టి, గాజులు పెట్టడం హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం సృష్టించింది. మరోవైపు నామినేషన్ నేపథ్యంలో రీతూ చౌదరీ – డీమాన్ పవన్ మధ్య వచ్చిన గ్యాప్‌పై హౌస్‌లో చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ఇమ్మాన్యుయెల్ సరదాగా ఆటపట్టించగా, దివ్య మాత్రం రీతూలోని గేమ్ ప్లే పై హాట్ కామెంట్స్ చేసింది.
రీతూ తనని నామినేట్ చేస్తోందంటూ, తనపై చెస్ ఆడుతున్నట్టుగా ఉందంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు తనూజ కూడా రీతూ సొంతంగా కాదు, డీమాన్ కోసం గేమ్ ఆడుతుందని చెప్పడం గేమ్‌లో కొత్త టెన్షన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ వారం కారణంగా ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, నవ్వులు, స్ట్రాటజీ డిస్కషన్స్‌తో నిండి కనిపించింది. ఇక బుధవారం ఎపిసోడ్లో డీమాన్ పవన్ అమ్మ ఎంట్రీ ఉండడంతో మరిన్ని ఎమోషనల్ సన్నివేశాలు రావడం ఖాయం.