Vidudhala Part 3 | కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1). కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడిక ఈ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2) కూడా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం పార్ట్ 2 చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా కోలీవుడ్ సర్కిల్లో ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చస్తోంది. ఇప్పటికే రన్ టైం 4 గంటల 30 నిమిషాల వరకు చేరుకుందట. ఇంకా 30 శాతం షూటింగ్ పెండింగ్‌లో ఉందని ఇన్సైడ్ టాక్. ఈ వార్తలతో వెట్రిమారన్ మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌కు కూడా ప్లాన్ చేస్తున్నాడంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో ఓటీటీ రైట్స్ కోసం పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఒకవేళ మేకర్స్ మూడో పార్ట్ ప్లాన్ చేస్తున్నారంటే మాత్రం ఓ వైపు నిర్మాతలు, మరోవైపు అభిమానులను గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి దీనిపై వెట్రిమారన్ టీం ఏదైనా ప్రకటన జారీ చేస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
విడుదలై ప్రాంచైజీలో విజయ్ సేతుపతి (VijaySethupathi) పెరుమాళ్ వాథియార్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి రోల్ కొనసాగనుంది. అతడికి జోడీగా మంజు వారియర్ (Manju Warrier) మెరువబోతుంది. సినిమాలో విజయ్ సేతుపతి మరింత ఎక్కువ సేపు ఉండేలా మేకర్స్ కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేశారని టాక్. అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించగా, కానిస్టేబుల్ పాత్రలో సూరి నటించాడు.
Arjun Reddy | అర్జున్ రెడ్డి @ ఏడేండ్లు.. సందీప్ రెడ్డి వంగాకు విజయ్ దేవరకొండ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..?
Megha Akash | రజినీకాంత్‌ను కలిసిన మేఘా ఆకాశ్-సాయి విష్ణు.. స్పెషల్ ఇదే
35 Chinna Katha Kaadu | నివేదా థామస్ 35 చిన్న కథ కాదు థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్..!