Viduthalai Movie | హీరోల ఇమేజ్‌తో సంబంధంలేకుండా కేవలం కథకు ఏది కావాలో దాన్ని మాత్రమే తెరకెక్కించే తమిళ దర్శకుడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లోని హీరో పాత్రకు భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు గట్రా ఏమి ఉండవు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథకు ఏమి కావాలో అది మాత్రమే తీస్తాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోను వెట్రిమారన్‌కు యమ క్రేజ్ ఉంది. కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడిపోతుంటారు. ఇక గత ఏడాది ఆయన దర్శకత్వం వహించిన ‘విడుతలై పార్ట్-1’ రిలీజై మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘విడుతలై 2’ రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ చివర దశలో ఉండగా విడుదలకు రెడీ అవుతుంది ఈ చిత్రం. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ ఫస్ట్ లుక్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. దీనితో పాటు మరో పొస్టర్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టర్లో విజయ్‌తో పాటు మంజు వారియర్ కనిపిస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్‌లో విజయ్ సేతుపతి మావోయిస్ట్‌గా ఎందుకు మారాడు అనేది చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ నటుడు కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.
ALso Read..