Vidaa Muyarchi | తమిళ స్టార్ నటుడు అజిత్ కుమార్ (Ajithkumar) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘విడాముయర్చి’ (Vidaa Muyarchi). ఏకే 62గా వస్తున్న ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. త్రిష (Trisha) కథానాయికగా నటిస్తుంది. ఎంత వాడు గాని (Yennai Arindhal) తర్వాత అజిత్- త్రిష కాంబినేషన్లో ఈ సినిమా రానుండటంతో మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి అజిత్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా త్రిష ఫస్ట్ లుక్ వదిలారు.
రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్ చూస్తే.. ఈ చిత్రంలో అజిత్ త్రిష భార్య భర్తలుగా నటించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్ కిజర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
#VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN
— Trish (@trishtrashers) July 19, 2024
Also Read..