కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు వెట్రిమారన్ (Vetrimaaran). ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ఇప్పటికే ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుందని, ఫస్ట్ పార్టులో తారక్ (Jr NTR), రెండో పార్టులో ధనుష్ లీడ్ రోల్లో కనిపించనున్నారంటూ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వెట్రిమారన్-ధనుష్-జూనియర్ ఎన్టీఆర్ కాంబో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన రేపు ఉండనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న తమిళ చిత్రం విడుతలై ఆడియో లాంఛ్ ఈవెంట్ రేపు జరుగనుంది. ఈ కార్యక్రమంలో వెట్రిమారన్ కొత్త సినిమా ప్రకటించబోతున్నారంటూ జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే. వెట్రిమారన్ ప్రస్తుతం స్టార్ హీరో సూర్యతో వాడివాసల్ తెరకెక్కిస్తున్నాడు.
వెట్రిమారన్ ఈ సినిమా తర్వాత తారక్, ధనుష్‌తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టనున్నట్టు టాక్. దీనిపై వెట్రిమారన్ టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నాడు. మరోవైపు ఇటీవలే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ధనుష్. మరి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేసన్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుండటం నిజమేనా..? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
Read Also :
Nelson Dilipkumar | నెల్సన్ దిలీప్ కుమార్‌కు స్టార్ హీరో వెస్పా స్కూటర్ గిఫ్ట్.. స్పెషల్ ఏంటో..?
Bimbisara 2 | క్రేజీ టాక్.. కల్యాణ్ రామ్ బింబిసార 2 డైరెక్ట్ మారాడా..?
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్