Vidudhala Part 2 | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetri Maaran). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుతలై పార్ట్-1 (తెలుగులో విడుదల పార్ట్ 1) ఏ స్థాయిలో హిట్టయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సూపర్ హిట్‌కు సీక్వెల్ విడుతలై పార్ట్ 2 (Vidudhala Part 2)కూడా రాబోతుందని తెలిసిందే. మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. విడుదలై పార్ట్ 2 ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11:30 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రీ లుక్ ద్వారా తెలియజేశారు. విడుతలై పార్ట్-1లో విజయ్ సేతుపతి పెరుమాళ్ వాథియార్ పాత్ర పోషించగా.. గిరిజనులకు అండగా నిలిచే పెరుమాళ్‌గా కనిపించాడు. సీక్వెల్లో కూడా విజయ్ సేతుపతి పాత్ర కొనసాగనుండగా.. ఇందులో మక్కల్ సెల్వన్‌కు జోడీగా మంజు వారియర్ (Manju Warrier) నటిస్తున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీసులకు మధ్య నడిచే పోరాటం నేపథ్యంలో సాగనున్న పార్ట్ 2 ఎలా ఉండబోతుందోనని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాతో కమెడియన్ సూరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఎంట్రీతోనే హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు.
Most anticipated update is here!
Director #VetriMaaran ‘s #VidudalaPart2 First Look launch tomorrow @ 11:30 AM. StayTuned
An @ilaiyaraaja Musical @VijaySethuOffl @sooriofficial @elredkumar @rsinfotainment @GrassRootFilmCo @ManjuWarrier4 @BhavaniSre @anuragkashyap72 #Kishore… pic.twitter.com/8Y7SeD374O
— Ramesh Bala (@rameshlaus) July 16, 2024
Janhvi Kapoor | స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాన్వీకపూర్ Ulajh ట్రైలర్
Sardar 2 | మిషన్ కంబోడియా టైం.. కార్తీ సర్దార్ 2లో స్టార్ యాక్టర్
Kanguva | సూర్య కంగువ సాంగ్‌లో ఎంతమంది ఆర్టిస్టులుండబోతున్నారో తెలుసా..?
Raayan | ధనుష్ స్టన్నింగ్ లుక్‌తో రాయన్ ట్రైలర్ అనౌన్స్మెంట్

విడుదల పార్ట్ 1 ట్రైలర్..