Rukmini Vasanth | రిషబ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతార చాఫ్టర్ 1 (ప్రీక్వెల్). 2025లో అత్యధిక గ్రాస్ సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లు లైఫ్ టైం వసూళ్లు రాబట్టి.. సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన కన్నడ సినిమాగా అరుదైన ఫీట్ నమోదు చేసింది.
కాగా ప్రీక్వెల్‌లో ఎవరూ ఊహించని విధంగా రుక్మిణి వసంత్ విలన్ రోల్లో కనిపిస్తుంది. చాలా మంది ఈ రోల్ చూసి షాకయ్యారు. అయితే విలన్ పాత్ర గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం షేర్ చేసింది రుక్మిణి వసంత్ .
నా కెరీర్ తొలినాళ్లలోనే కాంతార చాప్టర్ 1లో నేను విలన్ పాత్రలో నటించడం చాలా ప్రమాదకర ప్రయోగం. దీంతో ఇక నేను జీవితంలో మిగిలిన టైం అంతా విలన్ పాత్రల్లో నటిస్తానేమోనని ఆశ్చర్యపోయా. నేను నెగెటివ్ రోల్ పోషించడాన్ని జనాలు ప్రేమించారు.. వాళ్లు నన్ను అసహ్యించుకోలేదు. అందువల్లే సినిమా ఎలా ఆడుతుందో ఆలోచిస్తూ నేను భయపడాల్సిన అవసరం లేదంది. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు అది గొప్ప విషయమంటూ చెప్పుకొచ్చింది రుక్మిణి వసంత్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రుక్మిణి వసంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో రెండు భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. వీటిలో ఒకటి కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తోన్న టాక్సిక్ కాగా.. మరొకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సినిమాలే కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!