Chiranjeevi | కథను నమ్మి సినిమాలు చేసే టాలీవుడ్ డైరెక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు వెంకీ అట్లూరి (VenkyAtluri). గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. సినిమా సినిమాకు ప్రేక్షకులకు ఇంప్రెస్ చేస్తూ ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెంచేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్లో వార్తలు రౌండప్ చేస్తున్నాయని తెలిసిందే. ఇప్పటికే విశ్వంభరను పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. మరోవైపు శ్రీకాంత్ ఓదెల సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
వెంకీ అట్లూరి -చిరంజీవి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు నిర్మాత నాగవంశీ. ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి నాగవంశీ మాట్లాడుతూ.. అవును చిరంజీవి వెంకీ అట్లూరితో మాట్లాడారు. కానీ మనం సినిమా తీస్తే ప్రేక్షకులను సంతృప్తి పరచాలి. అందుకు తగ్గ నా దగ్గర లేదని వెంకీ అట్లూరి అన్నాడు. ఏడాదిలో కథ రెడీ చేసి మీ దగ్గరికొస్తానని చిరంజీవికి వెంకీ అట్లూరి చెప్పొచ్చాడన్నాడు నాగవంశీ. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెంకీ-చిరు సినిమా అప్డేట్ రావాలంటే ఖచ్చితంగా మరో ఏడాది పట్టొచ్చని నాగవంశీ కామెంట్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
ఇక సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు.
#Chiranjeevi – #VenkyAtluri On the Cards!
Chiranjeevi Garu spoke to Venky, but Venky requested at least a year to prepare the script, says Naga Vamsi. pic.twitter.com/8MaaD55LK0
— Movies4u Official (@Movies4u_Officl) January 20, 2025
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?