Venky Atluri | ఈ ఏడాది స్టార్ హీరో ధనుష్‌తో సార్ సినిమా తెరకెక్కించాడు యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. సార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వెంకీ అట్లూరి ఇటీవలే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు వెంకీ అట్లూరి. తాను ఇకపై ప్రేమకథలే తీయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
అంతేకాదు తన తదుపరి సినిమా స్టోరీ నార్తిండియా (ఉత్తర భారతదేశం) బ్యాక్ డ్రాప్లో యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని ఉంటుందని అన్నాడు వెంకీ అట్లూరి. పాన్ ఇండియాస్థాయిలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తుంది. ఈ చిత్రం 2024 సమ్మర్లో విడుదల కానుంది.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మలయాళ గ్యాంగ్‌స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కోట చిత్రంలో నటిస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సీతారామం సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన దుల్కర్ సల్మాన్ ఈ సారి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడనేది చూడాలంటున్నారు.