Venkatesh | వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram).. ఈ క్రేజీ కాంబో అనగానే గుర్తొచ్చే సినిమా నువ్వు నాకు నచ్చావ్. రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఆల్‌టైమ్ ఫేవరేట్ సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతూ అందరికీ పసందైన వినోదాన్ని అందిస్తుంది. మరి వెంకీ, త్రివిక్రమ్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరూ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారని ఓ వార్త ఫిలింనగర్లో హల్ చల్ చేస్తుంది.
త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందట. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ ప్రకటన జూన్ 6న గ్రాండ్‌గా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఇదే నిజమైతే ఈ ఇద్దరు ఎలాంటి సినిమాతో ఆడియెన్స్‌ను పలుకరించబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో మెరువబోతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే సిల్వర్‌స్క్రీన్‌పై వెంకీ-రుక్మిణి వసంత్ కాంబినేషన్ అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకోవడం గ్యారంటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో మైథలాజికల్ ఫిల్మ్‌ను ప్రకటించాడని తెలిసిందే. అయితే అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో చేయబోయే సినిమా తర్వాతే త్రివిక్రమ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. ఈ నేపథ్యంలో వెంకటేశ్ సినిమాను లైన్లో పెట్టి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడని చర్చ నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి క్రేజీ అప్డేట్ రాబోతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.