Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్లో పేరు ప్రఖ్యాతలు అందిపుచ్చుకోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అయితే రాజమౌళితో సినిమా చేస్తే అది కచ్చితంగా హిట్ అవుతుందని అందరికి తెలుసు. కాని గత సెంటిమెంట్ ప్రకారం తర్వాతి సినిమాలు ఫ్లాప్ అవుతాయి.
ఇప్పుడు మహేష్ బాబు తర్వాతి చిత్రం కూడా ఫ్లాప్ అవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే అసలు మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఎవరి దర్శకత్వంలో చేయనున్నారని ఇప్పటి నుండే చర్చ మొదలైంది. అయితే మహేశ్ బాబు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు వెయింట్ లో ఉన్నారని తెలుస్తోంది. వారెవరో కాదు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు అని తెలుస్తోంది. వీరి ముగ్గురితో మహేశ్ బాబు సినిమాకు ఓకే చెప్పినట్టు ప్రచారం. పుష్ప2తో భారీ హిట్ కొట్టిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నెక్ట్స్ సినిమా అని అంటున్నారు. వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడంతో మహేష్ బాబుకు సుకుమార్ ఎలాగైనా హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మహేష్‌తోనే యానిమల్ చేయాలని సందీప్ అనుకున్నప్పటికీ ఆ స్టోరీ తనకి విరుద్ధంగా ఉంటుందని మహేష్ తిరస్కరించారు. అయితే స్పిరిట్, యానిమల్ పార్క్ పూర్తిచేసి మహేష్ బాబుతో సినిమా చేయాలనే పట్టుదలతో సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. ఒక కథను కూడా వినిపించినట్లు తెలుస్తోంది. అయితే సుకుమార్, సందీప్ రెడ్డి వంగాల్లో ఎవరితో ఒకరితో మాత్రం మహేష్ సినిమా పక్కా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం మహేష్ నెక్ట్స్ చిత్రం హిట్ అవుతుందా లేదా చూడాలి.