Shruti Haasan | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ మే 24న (శనివారం) అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ తన బృందంతో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చెన్నైలోని సాయిరాం కళాశాలలో ఈ భారీ వేడుకను నిర్వహించారు.
అయితే ఈ వేడుకలో కథానాయిక శృతి హాసన్ తన అద్భుతమైన గాత్రంతో థగ్లైఫ్లోని ‘విణ్వెళి నాయగ’ (Vinveli Nayaga) పాటను పాడగా.. ఈ ప్రదర్శనతో వేదికను దద్దరిల్లేలా చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె పర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
#ThugLife – ‘Vinveli Nayaga’ track in ShruthiHaasan voice 🥶🔥
pic.twitter.com/EziF8XwI9P— AmuthaBharathi (@CinemaWithAB) May 24, 2025