Sankranthiki Vasthunam | టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన గోదారిగట్టు మీద రామచిలకవే, మీను పాటలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా మూడో సాంగ్ అప్డేట్ వచ్చేసింది.
ఈ సారి బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు వెంకటేశ్ రెడీ అవుతున్నాడు. మూడోపాటను ఏదైనా ఎక్స్ట్రాఆర్డినరీ వాయిస్‌తో ట్రై చేయాలని అనిల్ రావిపూడి అంటుంటే.. ఆ పాటను వెంకీ నేను పాడతా.. నేను పాడతానంటున్నాడు. వెంకీ చేష్టలతో విసుగొచ్చిన అనిల్ రావిపూడి సాంగ్‌ను వెంకీతో పాడించండి అని చెబుతున్నాడు. ఊరమాస్ బీట్తో థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఉండబోతుందని సింపుల్ ట్రాక్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
After two chartbuster melodies 🎶
The third single of #SankranthikiVasthunam is going to be a blasting experience for you all💥 #BlockbusterPongal Lyrical Video coming soon🔥— https://t.co/R4mmeRaJOi pic.twitter.com/RZHhChkiGf
— BA Raju’s Team (@baraju_SuperHit) December 26, 2024
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్