టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ (SAINDHAV) చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సైంధవ్‌లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను కొత్త పోస్టర్‌తో షేర్ చేసుకున్నారు మేకర్స్.
వెంకటేశ్ గన్ పట్టుకుని కంటెయినర్‌పై కూర్చొన్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. ఈ చిత్రాన్ని 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. తాజా లుక్ సైంధవ్‌లో గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చేస్తుంది.సైంధవ్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం రుహానీ శర్మ (Ruhani Sharma) పేరు పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
వెంకటేశ్ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. సైంధవ్ చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే కథతో వస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.
సైంధవ్ రిలీజ్ టైం ఫిక్స్..
#SAINDHAV in theatres worldwide on DEC 22nd 2023❤️#SaindhavOnDEC22 @Nawazuddin_S @KolanuSailesh @vboyanapalli @Music_Santhosh @tkishore555 @NiharikaEnt #Venky75 pic.twitter.com/B2bSiwetPn
— Venkatesh Daggubati (@VenkyMama) March 29, 2023
సైంధవ్ గ్లింప్స్ వీడియో..
Read Also :
Ravi Kishan | రేసుగుర్రం విలన్నూ వదలని కాస్టింగ్ కౌచ్.. హాట్ టాపిక్‌గా రవికిషన్ కామెంట్స్
Narayana & Co Teaser | ఎంటర్టైనింగ్గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్
Ponniyin Selvan-2 | పొన్నియన్ సెల్వన్ -2 ఈవెంట్‌కు మరో స్టార్ హీరో..?