లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌లో తెలంగాణ యాసలో సాగే పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు టాలీవుడ్ యువ నటుడు సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం నారాయణ అండ్ కో (Narayana & Co). చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఇటీవలే లాంఛ్ చేసి ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ (Narayana & Co teaser )ను లాంఛ్ చేశారు .
టీజర్ నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథతో ఫన్ ఎలిమెంట్స్‌తో ఎంటర్టైనింగ్ గా సాగుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ నటిస్తున్నాడు. అతడి భార్యగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై సుధాకర్ కోమాకుల పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021లో కార్తికేయ టైటిల్ రోల్ పోషించిన రాజావిక్రమార్కలో కీలక పాత్రలో నటించాడు సుధాకర్ కోమాకుల. ఈ యాక్టర్ చాలా రోజుల తర్వాత కామెడీతో నవ్వించేందుకు రెడీ అవుతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది.
నారాయణ అండ్ కో టీజర్..