Ravi Kishan | సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణంగా వినిపించే విషయం. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన యాక్టర్లలో కొందరు ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ (casting couch) బారిన పడ్డవారేనని అప్పుడప్పుడు తెరపైకి వచ్చే వార్తలే చెబుతుంటాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడి బాధపడేది మాత్రం ఎక్కువగా మహిళలు (ఫీ మేల్ యాక్టర్లు) అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వారిలో మేల్ యాక్టర్లు కూడా ఉండటం అరుదనే చెప్పాలి.
ఈ జాబితాలో రేసు గుర్రం విలన్, పాపులర్ భోజ్‌పురి నటుడు ( గోరఖ్ పూర్ ఎంపీ) రవికిషన్ (Ravi Kishan) ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓ చిట్‌చాట్‌లో రవికిషన్ను అడుగగా.. తాను ఓ సంఘటన నుంచి అంత సులభంగా బయటపడలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు. కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో ఉండే విషయం. నేను కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా.. కానీ ఆ ఉచ్చులో నుంచి నేను ఎలాగోలా తప్పించుకోగలిగాను. నేను టాలెంటెడ్ అని తెలుసు. నా ప్రయత్నాన్ని, పనిని నిజాయితీగా చేయాలని నాన్న నాకు నేర్పించారన్నాడు రవికిషన్.
అయితే రవికిషన్ ఇంతకీ తనను వేధించిన వ్యక్తి ఎవరో చెప్పకుండా.. ఆమెను బిగ్ షాట్ ఉమెన్ (big shot women)గా అభివర్ణించాడు. ఆ బిగ్ షాట్ ఉమెన్ నన్ను రాత్రి ఇంటికి రమ్మని పిలిచింది. అయితే నేను రానని చెప్పానని చెప్పుకొచ్చాడు. రవికిషన్ ఆమె ఎవరో పేరు వెల్లడించకుండా బిగ్ షాట్ ఉమెన్ (ప్రముఖ వ్యక్తి) అని చెప్పడంతో.. తన విలనిజంతో అందరినీ భయపెట్టించే రవికిషన్ నే కాస్టింగ్ కౌచ్లోకి లాగిన ఆమె ఎవరై ఉంటారా..? అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.
Narayana & Co Teaser | ఎంటర్టైనింగ్గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్
Ponniyin Selvan-2 | పొన్నియన్ సెల్వన్ -2 ఈవెంట్‌కు మరో స్టార్ హీరో..?