Venkatesh | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చిరంజీవి, వెంకీ కాంబోలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సాంగ్ కూడా సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందట. కాగా వెంకీ మామ రోల్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.
వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. స్టైలిష్ అవుట్ ఫిట్ హెలికాప్టర్లో నుంచి ల్యాండింగ్ అయిన వెంకీ గన్‌మెన్స్ పహారాలో రావడం చూడొచ్చు. మేకర్స్ రిలీజ్ డేట్‌పై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ ఇవ్వనున్నారట.
మొత్తానికి వెంకీ మామ నుంచి అభిమానులు, మూవీ లవర్స్ కోరుకునే ఫన్ ఉండబోతుందని తాజా లుక్ హింట్ ఇచ్చేస్తుంది. కామిక్ టైమింగ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వెంకీ కోసం అనిల్ రావిపూడి ఎలాంటి సీన్లు రెడీ చేశాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Any time
Any centre
Single hand ~ #VictoryVenkatesh ❤️🔥❤️🔥❤️🔥Happy Birthday to Victory @venkymama from team #ManaShankaraVaraPrasadGaru 😀❤️
Witness his Victorious Presence on the big screens this Sankranthi 2026 💥💥
Megastar @KChiruTweets @anilravipudi #Nayanthara… pic.twitter.com/hGwlSdgxhT
— Shine Screens (@Shine_Screens) December 13, 2025
Wishing you many happy returns my dear @VenkyMama 💐💐💐
You’ve always brought warmth and positivity wherever you go, and I cherish every moment we’ve shared during the shoot of #ManaShankaraVaraPrasadGaru 🤗
Have a truly joyful and blessed year ahead. pic.twitter.com/ybPIXQnYZ2
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 13, 2025
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో