వెంకటేశ్ నటించిన నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీ సినిమాలు మాటల రచయితగా త్రివిక్రమ్‌కు ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాయో తెలిసిందే. కాలక్రమంలో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఎందరో స్టార్ట్హీరోలను డైరెక్ట్ చేశారు. కానీ ఎందుకో వెంకటేశ్‌ని మాత్రం డైరెక్ట్ చేయలేకపోయారు. అయితే.. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలావుంటే.. ఈ సినిమాకు ‘వెంకటరమణ’ అనే టైటిల్ పెడుతున్నట్టు మొదట్లో వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘అబ్బాయిగారు 60ప్లస్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. వెంకటేశ్ నటించిన ‘అబ్బాయిగారు’ సూపర్‌హిట్ మూవీ. వెంకటేశ్ వయసు ప్రస్తుతం 60ప్లస్. ఈ కథకు కూడా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్. మరోవైపు ‘ఆనందనిలయం’ అన్న పేరు కూడా బలంగా వినిపిస్తుంది. త్రివిక్రమ్‌కు ‘ఆ’ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అబ్బాయిగారు 60ప్లస్, ఆనందనిలయం పేర్లు లైన్లోకొచ్చాయి. మరి వీటిలో ఏది ఖరారవుతుందో చూడాలి.