MBBS | తొగుట ఏప్రిల్ 04 : జ్ఞానాన్ని మించినది ఏది లేదని.. చదువుతోనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన పోతరాజు యాదగిరి- భాగ్యల కుమార్తె డాక్టర్ స్వేత ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు స్వీట్ తినిపించి.. సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వేత తండ్రి యాదగిరి మొదటి నుండి కుమార్తెను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నాడని, కుమార్తెకు బాసటగా నిలవడం జరిగిందన్నారు. అనారోగ్యంతో యాదగిరి దూరమైనా చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో తల్లి భాగ్య సహకారంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని తండ్రి కన్న కలలు నెరవేర్చడం జరిగిందన్నారు.
నాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుండి మొదలుకొని నేటి డాక్టర్ స్వేత వరకు కూడా ఉన్నత చదువులతోనే అనుకున్నది సాధించడం జరిగిందన్నారు.. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కుటుంబంలో ఒక స్వేత తయారు కావాలన్నారు. పేదరికం లో ఉన్నాం అని బాధపడే వారు స్వేతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.
స్వేతను అభినంధించిన వారిలో నాయకులు డబ్బికారి పెంటోజీ, పిట్ల వెంకటయ్య, బండారు స్వామి గౌడ్, పోతరాజు రవీందర్, పాత్కుల బాలేష్, ఈదుగాళ్ల పర్శరాములు, పులిగారి లక్ష్మణ్, సుతారి రాంబాబు, పోతారాజు స్వామి, అజాం, శేఖర్, రాజు తదితరులు ఉన్నారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్