Veera Simha Reddy OTT | ఓటీటీలోకి బాలయ్య వీర సింహారెడ్డి
Veera Simha Reddy | నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘వీర సింహారెడ్డి’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
‘‘సీమ సింహం వేట షురూ. ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుంచి ‘వీర సింహారెడ్డి’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రెడీ నా?’ అని హాట్‌స్టార్ ట్విట్టర్లో రాసుకొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య ఈ నెల 28న (నెట్‌ఫ్లిక్స్) ఓటీటీలోకి అడుగుపెడుతున్నది. కాగా.. అంతకంటే ఐదు రోజుల ముందే బాలయ్య హాట్‌స్టార్‌లో సందడి చేయనున్నాడు.
Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar
It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

