VD 12 Teaser Balayya Voice Over | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండగా విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. అయితే విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ నుంచి త్వరలోనే టీజర్ అప్డేట్ను మేకర్స్ పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ టీజర్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు కూడా వైరల్‌గా మారాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు పండగనే అని చెప్పుకోవాలి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.