కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్గోల్డ్ ఫిష్ చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు (Karthik Raju) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా..వచ్చేస్తున్నా’ (Vastunna Vachestunna). అందాల భామ మిస్తి చక్రవర్తి (Mishti Chakraborty) హీరోయిన్. తేజ స్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశె ట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) విడుదల చేశారు.
ఈ సందర్భంగా శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ..‘కార్తీక్‌రాజునటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇంప్రెసివ్‌గా వుంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేలా వుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ…‘ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములతో మా ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌ఇది. ఆడియన్స్ సర్ఫ్రైజ్గా ఫీలయ్యే ఎ న్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా.శేషసాయి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Magical Blockbuster #LoveStory director sri@sekharkammula
— BA Raju's Team (@baraju_SuperHit) October 19, 2021
Garu launched the title first look of Vastunna Vachestunna..@KarthikRaju@gvmusiconline@mishtichakra@prashantalakun2@devi_director@dpkpavanispowe1 pic.twitter.com/VY52l6VwWM
ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: మహి శార్ల, సంగీతం: జీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్వీ రామకృష్ణ, కథ న్‌ప్లే-దర్శకత్వం-నిర్మాత : సందీప్ గోపిశెట్టి
ఇది కూడా చూడండి
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
Raashi khanna: రెచ్చిపోయి అందాలు ఆరబోసిన రాశీ ఖన్నా..!
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు