Vash Level 2 | గుజరాతీ హారర్ చిత్రం ‘వాష్’ యొక్క సీక్వెల్ ‘వాష్ లెవల్ 2’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం అక్టోబర్ 22 నుంచి హిందీతో పాటు గుజరాతీ భాషలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 2023లో విడుదలై విజయం సాధించిన ‘వాష్’ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వచ్చింది. ఆగస్టు 27న గుజరాతీతో పాటు హిందీలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. కృష్ణదేవ్ యజ్ఞిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జానకి బోదివాలా, హితు కనోడియా, హితేన్ కుమార్, మోనల్ గాజ్జర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సీక్వెల్లో.. ప్రత్యేక శక్తులు కలిగిన అథర్వ (హితు కనోడియా) తన కూతురు ఆర్యా (జానకి బోదివాలా)ను ఒక డార్క్ ఫోర్స్ నుంచి కాపాడిన 12 ఏళ్ల తర్వాత కూడా, ఆ శక్తి ఆమెలోనే ఉందని తెలుస్తుంది. భయానక దృశ్యాలు, బ్లాక్ మ్యాజిక్ అంశాలతో కూడిన ఈ చిత్రం, సూపర్నాచురల్ సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను మరింత బలంగా చూపించనుంది.