Super Star Rajinikanth | చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘బైసన్’. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో నడుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్ రజనీకాంత్ బైసన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం రజనీకాంత్ స్వయంగా మారి సెల్వరాజ్‌కు ఫోన్ చేసి అభినందించినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సూపర్ మారి సూపర్! బైసన్ చూశాను. సినిమా సినిమాకి మీ కృషి, మీ వ్యక్తిత్వం నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. బైసన్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అంటూ తలైవర్ ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపాడు. అయితే సూపర్‌స్టార్ ప్రశంసలకు ఉప్పొంగిపోయిన మారి సెల్వరాజ్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ తన స్పందనను ఎక్స్ వేదికగా తెలిపారు. నా గత చిత్రాలు ‘పారియేరుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’, ‘మామన్నన్’, ‘వాళై’ విడుదలైనప్పుడు ఎలా అయితే నన్ను పిలిచి మనస్ఫూర్తిగా అభినందించారో అదే ప్రేమను నా ఐదో చిత్రం ‘బైసన్’ విషయంలోనూ చూపించారు. సూపర్‌స్టార్ గారు మా సినిమా చూసి, దర్శకుడిగా నన్ను, నిర్మాత రంజిత్ అన్నయ్య (పా. రంజిత్)ను ఫోన్లో అభినందించారు. నా తరపున, మా మొత్తం చిత్ర బృందం తరపున సూపర్‌స్టార్ రజనీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మారి సెల్వరాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కబడ్డీ క్రీడా నేపథ్యంతో, సామాజిక అంశాలను జోడించి రూపొందిన ‘బైసన్’ చిత్రం తమిళంలో మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం అక్టోబర్ 24న తెలుగులో విడుదల కానుంది. సూపర్‌స్టార్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ‘బైసన్’ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
‘சூப்பர் மாரி சூப்பர் பைசன் பார்த்தேன் படத்துக்கு படம் உங்கள் உழைப்பும் உங்கள் ஆளுமையும் என்னை ஆச்சரியபடுத்துகிறது மாரி வாழ்த்துக்கள் ‘
-சூப்பர் ஸ்டார்பரியேறும் பெருமாள், கர்ணன், மாமன்னன், வாழை பார்த்துவிட்டு என்னை அழைத்து பாராட்டியது போலவே எனது ஐந்தாவது படமான பைசன்… pic.twitter.com/QrNiTitvgB
— Mari Selvaraj (@mari_selvaraj) October 22, 2025