Varjun Tej | మల్యాల, డిసెంబర్ 3 : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని సినీ హీరో వరుణ్‌తేజ్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి సమక్షంలో గోత్రనామాలు చెబుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి జ్ఞాపికగా చిత్రపటాలను ఈవో రామకృష్ణారావు అందజేశారు. శేషవస్త్రంతో సత్కరించగా, ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ మహిమాన్వితమైన కొండగట్టు ఆంజనేయస్వామిని హనుమాన్దీక్షలో దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొండగట్టు ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని తెలుసుకున్నట్లు చెప్పారు.