Varun Tej | చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej). ఈ మెగా యాక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వీటీ15 (VT15) సినిమాను ప్రకటించాడని తెలిసిందే. రీసెంట్గా వరుణ్ తేజ్‌కు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ వీటీ15 ఫస్ట్ లుక్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్నీ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫొటోల రూపంలో బయటకు వచ్చింది.
ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయి. వరుణ్ తేజ్ అండ్ మేర్లపాక టీం స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో ఉంది. ఇంతకీ మరి వరుణ్ తేజ్ టీం ఎక్కడికెళ్లిందో తెలుసా..?. వీటీ 15 టీం ప్రస్తుతం వియత్నాంలో ఉంది. కథా చర్చలతోపాటు లొకేషన్ల వేట కూడా పూర్తి చేసిందని ఇన్ సైడ్ టాక్. అంతేకాదు మార్చి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుందని ఇన్సైడ్ టాక్.
వీటీ 15 ఫస్ట్ లుక్‌లో డ్రాగన్ డిజైన్ ఉన్న జాడిపై కోడ్ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. పోస్టర్లో వేట హాస్యాస్పదంగా మారితే అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తిని పెంచేస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో టాలీవుడ్లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మేర్లపాక. ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలతోపాటు క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నటీనటులు, షూటింగ్, రిలీజ్ అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.
స్క్రిప్ట్ డిస్కషన్స్ లో..
The pre-production of #VT15, an Indo-Korean horror-comedy entertainer is progressing rapidly ❤️🔥
The team is currently in Vietnam for the final story discussions and scouting breathtaking locations💥
Shoot begins in the First Week of March 🎬
Mega Prince @IAmVarunTej… pic.twitter.com/QscDyUHZzy
— Phani Kandukuri (@phanikandukuri1) January 29, 2025
వీటీ 15 ఫస్ట్ లుక్..
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let’s spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్