varun tej look in ghani | Ghani movie teaser | మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. సినిమా కోసం మన హీరోలు ఎంత కష్టపడటానికి అయినా సిద్ధంగా ఉన్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఈయన లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమా కోసం వరుణ్‌తేజ్ ట్రాన్స్ఫామ్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు.
One step at a time.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 14, 2021
One punch at a time.
One round at a time! 🥊
Mark your date and time tomorrow 11:08 am it is #Ghaniteaser #Ghani pic.twitter.com/pjOg6TOUhC
కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గని సినిమాతో బిజీగా ఉన్నాడు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఈయన మేకోవర్ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా వారేవా అంటుంది. తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ ఫోటోలు చూస్తుంటే ఆయన పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్‌గా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. గ్రీకు శిల్పం లాంటి బాడీ అంటారు కదా.. అలా మారిపోయారు వరుణ్ తేజ్. అచ్చంగా హాలీవుడ్ హీరో మాదిరి ఉన్న ఈయనను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గని సినిమాను అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న గని సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గని సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే గని సినిమా టీజర్ ( Ghani movie teaser )ను సోమవారం రిలీజ్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గని సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bheemla nayak | పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గనంటున్నాడుగా.. RRR టీంకు మొదలైన కంగారు.
samantha in pushpa | పుష్ప సినిమాలో సమంత.. రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తామంటున్న మేకర్స్?
allu bobby | అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
ghani | జూనియర్ బన్నీ రెడీ.. అల్లు అయాన్ వీడియోకు అదిరిపోతున్న రెస్పాన్స్..
Ghani: ‘గని వరల్డ్’ పేరుతో ప్రత్యేక వీడియో.. వెరైటీగా మూవీ ప్రమోషన్స్
Varun Tej Ghani | క్లైమాక్స్ కోసం వరుణ్ తేజ్ వర్కవుట్స్..వీడియో