samantha in pushpa | పుష్ప సినిమాలో సమంత.. రెమ్యునరేషన్ ఎంతైనా ఇస్తామంటున్న మేకర్స్?

samantha in pushpa | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుంటే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఆర్య 2 తర్వాత దాదాపు 12 ఏండ్లకు ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. పుష్ప సినిమాతో డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పుడు ఉర్రూతలూగిస్తుంది. ఇప్పటికే దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ అంటూ విడుదల చేసిన సాంగ్స్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఈ సినిమా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది పుష్ప టీం. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. పుష్ప సినిమాలో సమంత కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ సాగే ఐటెం సాంగ్ ఎంతో ఫేమస్ అయింది. ఆ పాటకు స్టెప్పులేసిన పూజా హెగ్డేకు కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు పుష్ప సినిమాలో కూడా అదే స్టైల్లో ఒక ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. అయితే ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంతను తీసుకోవాలని పుష్ప టీం భావిస్తుందట. ఇందుకోసం ఎంత పారితోషికాన్ని అయినా సమంతకు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారంట. ఇదే విషయం సమంతకు చెబితే.. సుకుమార్ మీద ఉన్న గౌరవంతో ఆమె కూడా ఒప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. వచ్చే వారం నుంచి అన్నపూర్ణ స్టూడియోలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుంది. మరి ఈ సాంగ్‌లో సమంత ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించిన అనసూయ.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన అనసూయ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
samantha | ఇక జరిగింది చాలు.. వైరల్‌గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ పోస్టు
Venkatesh : నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
Samantha remuneration | రెమ్యునరేషన్ పెంచిన సమంత..ఎంతో తెలుసా..?
Pushpa : పుష్పరాజ్ పిచ్చెక్కిస్తున్నాడుగా.. నవంబర్ 19న మరో అప్డేట్
pushpa | సామీ సామీ పాట పడే అవకాశం మౌనిక యాదవ్‌కు ఎలా వచ్చింది?
Anasuya : గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- Samantha
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

