సామీ సామీ పాటను మౌనిక యాదవ్ ఫస్ట్ టైం పాడగానే డీఎస్పీ ఎలా ఫీలయ్యాడు?
By Maduri Mattaiah
saami saami song fame singer mounika yadav | తెలంగాణ ఉద్యమ పాటలతో.. పలు తెలంగాణ జానపద గీతాలతో అందరి దృష్టిని ఆకర్షించిన గాయని మౌనిక యాదవ్. కరీంనగర్ జిల్లా కనగర్తికి చెందిన ఈ తెలంగాణ బిడ్డ తాజాగా అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘ పుష్ప ( Pushpa ) ’ చిత్రంలో ‘ సామీ సామీ ’ పాటను ఆలపించి తన శ్రావ్యమైన గొంతుతో అందర్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా తన పాటల ప్రయాణాన్ని మౌనిక యాదవ్ నమస్తే తెలంగాణతో ఎక్స్‌క్లూజివ్‌గా పంచుకుంది.

‘పుష్ప’ చిత్రంలో పాట పాడే అవకాశం ఎలా వచ్చింది?
గత సంవత్సరం ఓ రోజు సుకుమార్ మేనేజర్ ఫోన్ చేసి మీరు ‘పుష్ప’ చిత్రంలో ఓ పాట పాడాలి.. చెన్నయ్‌కి రమ్మన్నారు. డాడీ నేను చెన్నయ్‌కి వెళ్లి డీఎస్పీ సార్ దగ్గరకు వెళ్లి.. పాట పాడాం.. ఏడాది నుంచి ఈ రోజు కోసమే ఎదురుచూశాను. ఈ రోజు నేను పాడిన పాటకు ఇంత మంచి స్పందన వస్తుంటే ఆనందంగా వుంది.
సినిమాల్లో పాడే అవకాశం వస్తుందని ఊహించారా?
అసలు ఊహించలేదు.. జానపదాలు పాడుతున్నాను.. సినిమా వరకు వెళతానని.. పాడతానని అస్సలు అనుకోలేదు. చాలా పెద్ద సినిమాకు అందులో నా ఫేవరేట్ హీరో సినిమాకు, ఇంత పెద్ద సినిమాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
సామీ సామీ సాంగ్( saami saami song )కు వచ్చిన స్పందన ఎలా వుంది?
సాంగ్ రిలీజ్ రోజు సొంత ఊరిలో వుండటం మరింత ఆనందాన్ని కలిగించింది. ఊర్లో అమ్మ నాన్నలతో వున్నాను. ఊర్లో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.. కాల్స్ మేసేజ్‌లు. నెక్ట్స్ లెవల్లో వుంది నా ఆనందం..సాంగ్ రాగానే మా ఊర్లో అందరూ షాక్ అయ్యారు. విడుదలైన వారంలోపే మూడు కోట్ల మంది నా సాంగ్‌ను వినడం ఆనందంగా వుంది.
మీకు అవకాశం ఎలా వచ్చిందనుకుంటున్నారు?
మాట్ల తిరుపతి అన్న రచించిన ‘ బావ ఓ సారి రావా ( bava o sari rava folk song ) ’ అనే జానపద పాటలో నా వాయిస్ నచ్చి నాకు ‘ పుష్ప ’ సినిమాలో అవకాశం వచ్చింది. జానపద పాటల్లో నాకు ఎక్కువ తీసుకొచ్చిన పాట కూడా ఇదే.. ఈ పాటను దేవిశ్రీప్రసాద్ గారు చెన్నయ్‌లో నాతో ప్రత్యేకంగా పాడించుకొని విన్నారు.
సంగీతంలో శిక్షణ తీసుకున్నారా?
దేవుడి ఇచ్చిన గొంతు ఇది. సంగీతంలో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు.. జానపదాలు పాడుతూ…సినిమాల వరకు రావడం సంతోషంగా వుంది.పాటలు వింటూనే సంగీతం నేర్చుకునేదాన్ని…
ఎటువంటి శిక్షణ లేకుండా ఎలా సాధ్యపడింది?
చిన్నప్పుడు నాన్న ఇంట్లో పాడేవారు.. నాన్న నుండే మాకు సంగీతం అబ్బింది అనుకుంటున్నా.. దేవుడు ఇచ్చిన గొంతుతో ఇక్కడికి రావడం..అయితే మాలో ప్రతిభను గుర్తించి అమ్మ నాన్నలు ఎంతో ప్రోత్సాహించారు. కొంత మందికి టాలెంట్ వున్న అవకాశం వుండదు. కానీ అమ్మ నాన్న అక్కను, నన్ను ఎంతో ఎంకరేజ్ చేసేవారు.
పాట పాడటం పూర్తయిన తరువాత సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గారి స్పందన ఎలా వుంది?
డీఎస్పీ గారు తొందరగా ట్యూన్ క్యాచ్ చేశావు. చాలా బాగా పాడావు అని మెచ్చుకున్నారు. పాడిన పాట వినగానే నేనే నా ఈ పాట పాడింది. నాలో ఇంత టాలెంట్ వుందా అని నాకే అనిపించింది. గొప్ప రచయిత చంద్రబోస్ గారి సాహిత్యం..దేవిశ్రీప్రసాద్ గారి ట్యూన్.. ఈ పాటకు అల్లు అర్జున్ గారి స్టెప్స్.. రష్మిక డ్యాన్స్… పాటను గొప్ప స్థాయిలో నిలబెట్టాయి.
గాయనీగా మీకు స్ఫూర్తి ఎవరు?
అక్క, నేను తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడేవాళ్లం..అక్క నాకు స్ఫూర్తి.
‘సామీ సామీ’ పాట పాడుతున్నప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డారా?
నాతో పాటు నాన్న చెన్నయ్‌కు వచ్చాడు. నేను పాట పాడుతున్నప్పుడు పాడుతుందా? లేదా? పాట ఫైనల్ అవుతుందా లేదా అని టెన్షన్ పడ్డాడేమో అనుకున్నాను. కానీ నాన్న మాత్రం నేను టెన్షన్ పడలేదు.. నా బిడ్డ తప్పకుండా పాడుతుంది అని ధైర్యంగా వున్నానని చెప్పాడు.. దేవిశ్రీప్రసాద్ కూడా బాగా పాడావని మెచ్చుకున్నారు.. నాకు మాత్రం వాళ్లకు నచ్చుతుందో లేదో అనిపించింది.ఫైనల్‌గా బాగా పాడావు అనగానే రిలీఫ్ అయ్యాను.
వ్యక్తిగతంగా మీకు ఎలాంటి పాటలు పాడటం ఇష్టం?
జానపద పాటలతో పాటు జనాలను చైతన్యపరిచే పాటలంటే బాగా ఇష్టం. ఎన్ని అవకాశాలు వచ్చినా జానపద పాటలను మర్చిపోను. బాధ్యతతో పాటలు పాడుతూ ప్రజలు ఇచ్చినా ఈ గుర్తింపును కాపాడుకుంటాను.. ఈ సందర్భంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గారికి నా కృతజతలు. అలాగే నాకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇచ్చి జీవితంలో స్థిరపడేలా చేసినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను
INTERVIEW BY; MADURI MATTAIAH
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పుష్ప సినిమాలో సామి సామి పాట అవకాశం ఎలా వచ్చిందంటే..? : సింగర్ మౌనికయాదవ్..
Pushpa: పుష్ప మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారా.. డిసెంబర్ 17న రావడం కష్టమేనా?
Pushpa Promotional Event | పుష్ప స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
Anasuya: గుండు కొట్టించుకుంటానంటున్న అనసూయ.. ఎందుకో తెలుసా?
December Tollywood Movies | డిసెంబర్లో సినిమాల జాతర..బాక్సాఫీస్ షేక్ అవుతుందా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

