Pushpa: పుష్ప మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారా.. డిసెంబర్ 17న రావడం కష్టమేనా?

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ పార్ట్ ను ‘పుష్ప: రైజ్’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. కాని పరిస్థితులు చూస్తే ఆ డేట్‌కి వచ్చేలా కనిపించడం లేదు. ఇంత వరకు టీజర్, ట్రైలర్స్ విడుదల చేయకపోగా, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు.
‘పుష్ప’ పార్ట్-1 ఆలస్యమైతే ఆ తేదీకి రావాలని మరికొన్ని సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప’ చెప్పిన డేట్ కి రాకపోతే మాత్రం.. ‘ఆచార్య’ ను తీసుకెచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమా కూడా ఆ డేట్ కి రావాలని చూస్తోందట. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను ల ‘అఖండ’ కూడా ఆ తేదీ కోసం చూసే అవకాశం ఉంది.
పలు కారణాల వలన పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే తేదీకి నాని ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఇప్పుడు ‘పుష్ప’ ఆ తేదీకి రావాలని అనుకుంటే.. నాని సినిమాని వారం ముందుకు జరపాలని ప్రయత్నిస్తున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

