Bheemla nayak | RRR టీంను కంగారు పెడుతున్న పవన్ కళ్యాణ్..

RRR vs Bheemla nayak | సాధారణంగా ఇండస్ట్రీలో రాజమౌళి ( rajamouli ) సినిమాలకు అడ్డు రావడానికి దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. దర్శక ధీరుడు సినిమాలకు పోటీకి వెళ్తే ఒక రకంగా సూసైడల్ అటెంప్ట్ చేసినట్టే. ఆయన సినిమాలు అంత దారుణంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రణరంగం సృష్టిస్తూ ఉంటాయి. అందుకే రాజమౌళి సినిమా విడుదల చేస్తున్నాడు అని తెలియగానే.. మిగిలిన వాళ్లు సైలెంట్‌గా సైడ్ ఇస్తారు. లేదంటే ఆయన సినిమా ఎప్పుడు వస్తుంది అని తెలుసుకొని ఆ తర్వాత తమ సినిమాలను విడుదల చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఇదే జరుగుతుంది. జనవరి 7, 2022 కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ ( RRR ) సినిమా విడుదల కానుంది.

దాదాపు 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది ఈ సినిమా. రామ్ చరణ్ ( Ramcharan ), ఎన్టీఆర్ ( NTR ), అజయ్ దేవగణ్ వంటి సూపర్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. దీనికి పోటీగా రావడానికి బాలీవుడ్లో కూడా ఎవరూ సాహసించడం లేదు. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ ( Power star pawan kalyan ) నేనున్నాను అంటూ బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్నాడు. ఈయన నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న విడుదల కానుంది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయన రాస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వాయిదా పడుతోంది అనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా వస్తుండటంతో పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని.. అనుకున్నట్లుగానే జనవరి 12న పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతున్నట్లు నిర్మాతల నుంచి క్లారిటీ వచ్చింది. తమ సినిమా అనుకున్న తేదీకే విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన రాజమౌళితో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వార్ ఖాయం అయిపోయింది. మరోవైపు జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్ కూడా విడుదలవుతుంది. మరి ఈ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rajamouli | పవన్ కళ్యాణ్ సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికార్రా.. నెటిజన్ కు RRR టీమ్ రిప్లై..
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
bheemla nayak | పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..
Bheemla Nayak | భీమ్లా నాయక్‌లో రానా పాత్రను విలన్‌గా మార్చేస్తున్నారా?
Rana daggubati : రానా రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
Ntr: జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ చూడకపోవడానికి ఆయన తండ్రే కారణమట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

