Ghani: ‘గని వరల్డ్’ పేరుతో ప్రత్యేక వీడియో.. వెరైటీగా మూవీ ప్రమోషన్స్

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గని (Ghani). బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 3న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. అందులో భాగంగా ‘గని వరల్డ్’ పేరుతో ఓ ప్రత్యేక వీడియోను ట్విట్టర్ లో వదిలారు మేకర్స్.
పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియలో నదియా, నరేశ్, తనికెళ్ళ భరణి, నవీన్ చంద్ర, సయీ మంజ్రేకర్, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర తదితరులు కనిపించారు. ‘గద్దల కొండ గణేశ్’ మూవీ తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకించి నిపుణుల పర్యవేక్షణలో బాక్సింగ్ నేర్చుకొని, ఫిట్ నెస్ కోసం జిమ్ లో వర్కవుట్స్ చేసి మరీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి.
గని ప్రమోషన్లో భాగంగా ఇటీవల అల్లు అయాన్‌తో టైటిల్ సాంగ్ ని రీక్రియేట్ చేశారు. వరుణ్ తేజ్ మాదిరిగా ఈ పాటలో నటించాడు అయాన్ . వరుణ్ తేజ్ తరహాలో భారీ వర్కౌట్లు చేశాడు. మెగా, అల్లు అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. దీనికి వరుణ్ తేజ్ కూడా ఆశ్చర్యానికి గురి కావడం విశేషం. ఈ వీడియోని గీతా ఆర్ట్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది.
Here it is, Introducing the characters from#Ghani 🥊#GhaniTeaser Releasing on 15th Nov! 🔥@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @MusicThaman @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/eP23kHUxhy
— Varun Tej Konidela (@IAmVarunTej) November 11, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

