టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గని (Ghani). బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి (Kiran Korrapati) దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Ghani pre release event)ను ఏర్పాటు చేయగా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.
గని సినిమాకు వరుణ్‌తేజ్ చూపించిన డెడికేషన్‌ను తానెంతో గౌరవిస్తానని అన్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). వరుణ్ తేజ్ సినిమా సినిమాకు కొత్త కొత్త వేరియేషన్స్ ను చూపిస్తుంటాడన్నాడు. గని సినిమా కోసం వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం తప్పకుండా దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ కు మంచి గుర్తింపు వస్తుందన్నాడు బన్నీ. తాను ఇప్పటికే సినిమా చూశానని, చాలా బాగుందని చెప్పాడు.
గని చిత్రానికి యూనిట్ మెంబర్స్, నిర్మాత, డైరెక్టర్ అండ్ టీం ఉత్తమంగా పనిచేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా…అంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు బన్నీ. రెనాయ్ సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నదియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు బన్నీ. త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణలో బన్నీ, రష్మిక టీం పాల్గొననున్నట్టు టాక్. ఇప్పటికే రిలీజైన పుష్ప..రి రైజ్బాక్సాపీస్ ను షేక్ చేస్తూ కలెక్షన్ల పంట పండించిన సంగతి తెలిసిందే.