Naga babu | నిహారిక ఏ తప్పు చేయలేదు..అనవసర ప్రచారాలు చేయొద్దు : నాగబాబు
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ (Banjara hills Radisson blu)పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడుల ఘటనలో నిహారిక (Niharika)తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు వార్తల నేపథ్యంలో..నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ (Banjara hills Radisson blu)పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి..పబ్ యజమానులతోపాటు సుమారు 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు (Drugs Case)కు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వారిలో నాగబాబు కుమార్తె నిహారిక (Niharika)తోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాడిసన్ బ్లూ హోటల్ ఘటనపై నాగబాబు స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
గతరాత్రి రాడిసన్ బ్లూ హోటల్ పబ్‌లో జరిగిన సంఘటనపై స్పందించడానికి కారణం…నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడుండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు ఆమె క్లియర్. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు చెప్పారు. అనుమానాలకు తావివ్వకూడదని స్పందిస్తున్నా. నిహారికపై అనవసర ప్రచారాలు చేయకండని విజ్ఞప్తి చేశారు నాగబాబు.
Read Also : Banjara hills Radisson blu Drugs Case | డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సింగర్..టాలీవుడ్ నటికి నోటీసులు..!
ఈ కేసులో పోలీసులు నిహారికను విచారించిన తర్వాత నోటీసులు అందజేసి.. మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) కూడా ఉన్నట్టు సమాచారం.
Read Also : Nithiin New Movie | స్పీడు మీదున్న నితిన్ మరో సినిమా లాంఛ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

