Hansika | నా గురించి వస్తున్న ఆ వార్తలన్నీ పుకార్లే : హన్సిక
Hansika | జయాపజయాలతో సంబంధం లేకుండా.. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ దక్షిణాదిలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటి.. హన్సిక మోత్వాని. వెండితెరపై పదేండ్ల ప్రయాణం ఆమెది. త్వరలోనే 50వ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నది. రెండేండ్ల గ్యాప్ తర్వాత ఏడు వరుస సినిమాలతో దక్షిణాదిని షేక్ చేసేందుకు సిద్ధంగా ఉందీ సొట్టబుగ్గల సుందరి. తన కొత్త సినిమాల సంగతులు, విభిన్న పాత్రల విశేషాలు హన్సిక మాటల్లోనే..
కొత్తగా సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఆశతో ఉండండి.. ఈ క్షణంలోనే బతకండి. కష్టపడి పనిచేస్తూ వెళ్తుంటే విధి కూడా మీకు సహకరిస్తుంది. తప్పక విజయం సాధిస్తారు. ఇదే నేను ఆచరించే జీవన సూత్రం.
నా అందానికి తగ్గట్టు గ్లామర్ పాత్రలు వస్తే చెయ్యడానికి వెనకాడను. ఏ పాత్రకైనా శ్రమ, శక్తి కావాలి. పాత్రను ఆవాహనం చేసుకోలేకపోతే.. అవుట్‌పుట్ సరిగా రాదు. ఏ పాత్రా కష్టమైంది కాదు.. అలాగని సులువైంది కూడా కాదు.

‘మహా’ విడుదల కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నది. ఇది నా 50వ చిత్రం. ఆశనిరాశల్ని అధిగమించే మానసిక స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇటీవల నా 55వ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
నేను విభిన్నమైన స్క్రిప్ట్‌లు ఇష్టపడతాను. నటనలో మరింత వైవిధ్యం ఉండేలా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను. ఇప్పటి వరకూ మీరు చూసిన హన్సిక వేరు. రానున్న చిత్రాల్లో చూడబోతున్న హన్సిక వేరు. నటనలో ఎంత పరిణతి చెందానో మీరే చూస్తారు.
దర్శకులు నన్ను కొత్త కోణంలో చూపించాలని అనుకుంటున్నారు. నాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. నేను మోయగలిగే ప్రాజెక్టులనే భుజాలకు ఎత్తుకున్నాను. నన్ను విభిన్నమైన పాత్రలకు ఎంపిక చేసే దర్శకులకే ఆ క్రెడిట్ దక్కుతుంది.

ఓటీటీలు వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల హవా పెరిగింది. ఇదొక శుభ పరిణామం. నేనూ ఓటీటీ వేదికగా ఓ సిరీస్ చేస్తున్నాను. కథ బాగా కుదిరింది. అందులో నాదొక భిన్నమైన క్యారెక్టర్. ఓ ప్రేక్షకురాలిగా నన్ను నేను ఓటీటీ సిరీస్‌లో చూడాలని అనుకునేదాన్ని. ఆ ఆశ ఇప్పుడు తీరబోతున్నది.
ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అనేది చాలా పెద్ద టాస్క్. నేను దర్శకత్వం వైపు వెళ్తున్నాననే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. కొన్ని సినిమాలు ఇప్పటికే పూర్తి చేశాను. వాటిని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్నీ ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఫిక్షన్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా కలగలిసి ఉంటాయి.
Read More :
Hansika | తెలుగు,తమిళ,హిందీ భాషల్లో.. హన్సిక ‘మై నేమ్ ఈజ్ శృతి’”
“వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?”
“Hansika Motwani | హీరోయిన్లకు టైమ్ బాగుంది : హన్సిక”
“Hansika Motwani | బీచ్‌లో హన్సిక మోత్వాని.. స్టన్నింగ్ ఫొటోలు”
“హన్సికకు మంచి రోజులువచ్చాయి..!”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

