చిత్రసీమలో సుదీర్ఘకాలం పాటు ఒకే రకమైన స్టార్డమ్తో కొనసాగడం మామూలు విషయం కాదు. అందుకు ప్రతిభతో పాటు అదృష్టం కలిసిరావాలి. సీనియర్ కథానాయిక హన్సికను చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది. దాదాపు దశాబ్దంపైగా సినీ ప్రయాణం సాగిస్తున్న ఈ అమ్మడు ఇప్పటికి వరుస అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ రేసులో దూసుకుపోతున్నది. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ, దర్శకనిర్మాతలు పెట్టుకున్న నమ్మకమే తన విజయానికి కారణమని చెబుతున్నది హన్సిక. అంతేకాదు ఈ ఏడాది తొమ్మిది సినిమాలు తన ఖాతాలో ఉన్నాయని సంబురపడిపోయింది. ఆమె మాట్లాడుతూ ‘ఆశావాహదృక్పథంతో కొనసాగితే అంతా మంచే జరుగుతుంది. కొత్త సంవత్సరంలో అందరూ అదే భావనతో ముందుకుసాగండి. ఈ ఏడాది తొమ్మిది సినిమాలతో నా డైరీ ఫుల్ అయిపోయింది. ఇక నుంచి ప్రతి నెలా ఓ సినిమాతో మిమ్మల్ని పలకరిస్తుంటా. భవిష్యత్తు అంతా బంగారుమయంలా కనిపిస్తున్నది’ అని హన్సిక ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ మహా, పార్ట్నర్, రౌడీబేబీ, మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ వంటి సినిమాలతో బిజీగా గడుపుతున్నది.