డిజిటల్ మీడియా (Digital Media) పెరిగిన తర్వాత హీరోయిన్లకు అవకాశాలు పెరిగాయని చెబుతున్నది అందాల తార హన్సిక (Hansika Motwani). 12 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ నాయిక…ప్రస్తుతం ఆరేడు చిత్రాలతో తీరిక లేకుండా ఉంది. పుష్కర కాలంలో 50 సినిమాల మైలురాయి దాటేసి..సెంచరీకి పరుగులు తీస్తున్నది. హీరోయిన్ లకు సహజంగా ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉండటం అరుదుగా జరిగే విషయం. హీరోల సరసన కమర్షియల్ చిత్రాల్లో ఆడిపాడుతూనే నాయిక ప్రధాన చిత్రాల్లో నటిస్తూ తనదైన ప్రత్యేకత సంపాదించుకుందీ భామ.
ఇటీవల ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ…ఇప్పుడు హీరోయిన్లకు టైమ్ బాగుంది. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాక మాకు కొత్త తరహా కథలు దక్కుతున్నాయి. నాయిక ప్రధాన చిత్రాలకు గతంలోనూ ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు అది మరింత పెరిగింది. నేనూ ఒక సినిమా ఎంచుకునే ముందు ..ఆ సినిమాను థియేటర్ లో లేదా ఓటీటీలో నేను చూస్తానా లేదా అని ఆలోచిస్తాను. బాగుంది అనుకుంటే ఒప్పుకుంటాను. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందు నేను ఆలోచించేది ఇదే. అని చెప్పింది.
హన్సిక 50వ (Hansika 50)సినిమా మహా షూటింగ్ ఆలస్యమవుతున్నా…మిగతా చిత్రాలను లైనప్ చేసిందీ తార. పార్టనర్, 105 మినిట్స్, మై నేమ్ ఈజ్ శృతి (My Name Is Shruthi), రౌడీ బేబీ, విజయ్ చందర్ తో ఓ సినిమాతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నది హన్సిక. వీటిలో మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ తెలుగు, తమిళ ద్విభాష చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.